బాప్తీస్మం
బాప్తీస్మం గురించిన కథ
(మత్తయి 3:11, 13-17, 28:18-20)
యేసు క్రీస్తు ఆయన బోధను మరియు ప్రజలను బాగుచేయటం ప్రారంభించకముందు బాప్తీస్మం తీసుకోవడానికి యొర్దాను నదియొద్దకు వెళ్లారు. రక్షకుడు త్వరలో రాబోతున్నాడు కాబట్టి మీ పాపములను విడిచిపెట్టండి అని ప్రజలను పిలుస్తూన్న యోహాను అనే ప్రవక్త అక్కడ ఉన్నాడు. వారంతా ఎదురు చూస్తున్న ఆ రక్షకుడు యేసు క్రీస్తే.
పశ్చాత్తాప్పడటానికి యేసుక్రీస్తులో ఎటువంటి పాపము లేదు. మనందిరికి ఒక ఉదాహరణగా ఉండటానికి, యోహాను చెబుతున్న సందేశాన్ని ఒప్పుకొంటున్నట్లు యేసు క్రీస్తు కూడా యోహాను చేత బాప్తీస్మం తీసుకోవాలనుకున్నారు. మొదట్లో దీనికి యోహాను ఒప్పుకోలేదు. అతడు యేసుతో, "నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చు చున్నావా?" అని అన్నాడు. యేసు తనకంటే చాలా గొప్పవాడని యోహానును తెలుసు. అయితే ఇలా చేయటమే సరైనది అని యేసు చెప్పిన తరువాత యోహాను ఒప్పుకున్నాడు.
యోహాను యేసుకు బాప్తీస్మం ఇచ్చాడు. యేసు ఆ నీటిలో మునిగారు. ఆయన ఆ నీటినుండి బయటకు వచ్చినప్పుడు దేవుని స్వరం ఆకాశము నుండి ఇలా వినిపించింది, "ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నాను."
భూమిపైన ఆయన పరిచర్య చివరి దశలో ఉన్నప్పుడు శిష్యులకు ఇలా ఆజ్ఞాపించారు, "కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి." ఆయన ఆజ్ఞాపించినట్లుగానే శిష్యులు చేసారు. వారు ఎక్కడికి వెళ్లినా యేసుక్రీస్తును అంగీకరించిన అందరికి బాప్తీస్మం ఇచ్చారు.
ఈ కథను మళ్ళీ మళ్ళీ చెప్పడం ప్రాక్టీస్ చేయండి.
ప్రశ్నలు
- ఈ కథ నుండి బాప్తీస్మం గురించి ఏమి నేర్చుకున్నారు?
- మనము విధేయత చూపించాల్సినదేమిటి?
బాప్తీస్మం అంటే అర్ధం ఏమిటి
బాప్తీస్మం అను పదానికి అర్ధం "పూర్తిగా నీటిలో మునుగుట".
యేసు క్రీస్తు బాప్తీస్మం తీసుకున్నట్లే, ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరూ బాప్తీస్మం తీసుకోవాలి.
మత్తయి సువార్త చివరలో యేసు తన శిష్యులకు ఇలా ఆజ్ఞాపించారు:
కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుడి (మత్తయి 28:19)
అపోస్తుల కార్యములు 2:38 చదివితే ఈ వచనం ఇంకా బాగా అర్ధం అవుతుంది.
పేతురుమీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.
తండ్రి నామములో ఆత్మీయముగా శుభ్రపరచబడటం...
పాపములు ఒప్పుకుని పశ్చాత్తాప్పడటం
మన పాపములు ఒప్పుకుని వాటినుండి మనం దూరంగా వెళ్ళాలి. మన పాపములు, తప్పులు దాచి పెట్టకూడదు వాటిని దేవుని దగ్గర పేరు పేరునా చెప్పి ఒప్పుకోవాలి (1 యోహాను 1:9). దేవుని చిత్తానికి వ్యతిరేకముగా మనం ఏమి చేసినా వాటిని దేవుని ఎదుట చెప్పాలి. వాటిని బట్టి దేవుడిని క్షమాపణ అడిగి వాటిని చేయడం మానేయాలి. దేవుని సహాయముతో మన ఆలోచనలు, స్వభావము ఆయన చిత్తానికి అనుగుణంగా మార్చుకోవాలి.
యేసు క్రీస్తు నామములో ఆత్మీయముగా శుభ్రపరచబడటం...
యేసు క్రీస్తు నామములో నీటి బాప్తీస్మం
నీటి బాప్తీస్మం అంటే "తిరిగి జన్మించటం కోసం శుభ్రపరచబడటం" (తీతువు 3:5) రోమా 6:1-11 వచనం ఇలా వివరిస్తుంది. యేసు ఎలాగైతే పాతిపెట్టబడి మృతులలోనుండి తిరిగి లేచెనో, మనముకూడా నీటి బాప్తీస్మంలో నీటిలో మునిగి నూతన జీవము పొంది పైకి లేస్తాము. మన ప్రాచీన స్వభావము మరణించి, మనమికను పాపమునకు దాసులము కాకుండా ఉంటాము. దాని అర్ధం మన ఇకనుండి పాపం చేయక్కర్లేదు. మనం ఇప్పుడు కొత్త సృష్టి. (2 కొరింథీయులకు 5:17). బాప్తీస్మం లో మన పాత జీవితమును కప్పిపెట్టి క్రొత్త జీవితమును ప్రారంభిస్తాము. యేసు క్రీస్తు జీవన విధానము ఉదాహరణగా మన జీవితమును కూడా మార్చుకుంటాం.
పరిశుద్ధాత్మ నామములో ఆత్మీయముగా శుభ్రపరచబడటం...
దేవుని ఆత్మను పొందుకోవడం
దేవుడు మనకు ఆయన ఆత్మను ఇవ్వాలని కోరుకుంటున్నారు. పరిశుద్ధాత్మ మనకు దేవుడు ఇచ్చిన శక్తి. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు, సాతానును అడ్డుకోవడానికి ఆయన మనకు సహాయం చేస్తారు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము మొదలగు ఆత్మ ఫలములు మనలో ఎదుగుటకు ఆయన సహాయం చేస్తారు. (గలతీయులకు 5:22)
మనము దేవుని ఆత్మను పొందుకున్నపుడు మనలో ఏదో జరుగుతుంది. అది మన స్వభావంలో బయటకు కూడా కనిపిస్తుంది. (ఉదాహరణకు అపోస్తుల కార్యములు 19:6). మనకు ఆత్మీయ వరములు లభిస్తాయి. (1 కొరింథీయులకు 12:1-11 మరియు 14:1-40). ఈ వరములు ఇతరులు దేవుని శక్తిని అనుభవించేలా, వారిని శిష్యులుగా చేసేలా మనకు సహకరిస్తాయి.
మీ బాప్తీస్మం కోసం సిద్ధపడటం
మీ బాప్తీస్మం అప్పుడు మీ విశ్వాసమును పండగలా జరుపుకోవచ్చు.
- మీ బాప్తీస్మం ఎప్పుడు ఉండాలి?
- ఎవరిని పిలవాలి?
- మీ బాప్తీస్మం అప్పుడు దేవునితో మీ సంబంధం గురించి, దేవుడు మిమ్మల్ని ఎలా కాపాడారో, ఎలా మిమ్మల్ని మార్చారో అందరికి చెప్పవచ్చు.
నిర్దిష్ట సమయములో తొందర్లో బాప్తీస్మం తీసుకోవడానికి సమయం, తేదీ నిర్ణయించుకోండి . బాప్తీస్మం గురించి ఏమైనా ప్రశ్నలు ఉంటే వాటిని తొందరగా నివృత్తి చేసుకోండి.
బాప్తీస్మంకి సంబంధించిన ప్రశ్నలు:
- మీ పాపములన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నారా ?
- యేసు క్రీస్తు త్యాగం ద్వారా దేవుడు మీ పాపములన్నీ క్షమించారని మీకు తెలుసా ?
- మీ పాత జీవితాన్ని వదిలిపెట్టి దేవునితో క్రొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా?
- వెనుతిరగకుండా యేసును ఎల్లప్పుడూ వెంబడిస్తానని మీరు నిర్ణయించుకున్నారా?
- మిమ్మల్ని తిట్టినా, కొట్టినా, మీ కుటుంబం మిమ్మల్ని వెలివేసినా లేదా ఎటువంటి కష్టం వచ్చినా యేసు ప్రభువుని నమ్ముతూనే వుంటారా?
- మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలని కోరుకుంటున్నారా?